చాట్ జీపీటీ నుండి వైద్య సలహా తీసుకున్న ఓ వ్యక్తి ఆరోగ్యం విషమించి ఆసుపత్రిలో చేరారు. ఉప్పుకు ప్రత్యామ్నాయంగా సోడియం బ్రోమైడ్ను సూచించిన చాట్ జీపీటీ వల్ల అతనికి మానసిక సమస్యలు తలెత్తాయి. మూడు నెలలు ఈ మందును వాడిన అతడు తీవ్రమైన అనారోగ్యాన్ని ఎదుర్కొన్నాడు. వైద్యులు సకాలంలో చికిత్స అందించడంతో అతడు కోలుకున్నాడు. ఏఐ సలహాపై ఆధారపడకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.