మెదక్ జిల్లా తూప్రాన్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక ఎలక్ట్రిక్ బైక్ పూర్తిగా కాలిపోయింది. రాత్రి చార్జింగ్కు పెట్టి నిద్రపోయిన చంద్రశేఖర్ రెడ్డి బైక్ తెల్లవారుజామున మంటల్లో చిక్కుకుంది. మంటలు ఆర్పే ప్రయత్నాలు విఫలమయ్యాయి. బైక్‌తో పాటు విద్యుత్ వైర్లు, డ్రైనేజీ పైపులు దగ్ధమైనా, ఇంట్లో ఎవరికీ గాయాలు కాకపోవడం ఊరటనిచ్చింది.