తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవాణి దర్శన వేళల్లో మార్పులు చేసింది. ప్రస్తుతం ఉదయం 10 గంటలకు ఉన్న దర్శన సమయాన్ని సాయంత్రం 4:30 కి మార్చారు. ఇకపై రోజువారీ టికెట్లు అందుబాటులో ఉంటాయి. తిరుమలలో 800, రేణిగుంట విమానాశ్రయంలో 200 టికెట్లు రోజూ విడుదల అవుతాయి. అడ్వాన్స్ బుకింగ్ టికెట్లు ఉన్న భక్తులకు యధావిధిగా ఉదయం 10 గంటలకు శ్రీవాణి దర్శనం ఉంటుంది.