వికారాబాద్ జిల్లా కేంద్రంలో చడ్డీ గ్యాంగ్ హల్చల్ చేసింది. రాత్రి అయితే చాలు కంటి మీద కునుకు ఉండటం లేదు వికారాబాద్ ప్రజలకు. చెడ్డీలు వేసుకుని అర్థరాత్రి సమయంలో కాలనీల్లో తిరుగుతున్నారు చిన్న గ్యాంగ్. రాఘవేంద్ర కాలనీలోని ఒక ఇంటి ముందున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు ఇవి.