హైదరాబాద్‌లోని గోపాల్ నగర్లో షాకింగ్ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గ్లోబల్ ఎడ్జ్ స్కూల్ బస్సు ఒక బైకర్‌ను ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. మృతుడిని నాగరాజుగా గుర్తించగా, ఈ ప్రమాదం సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.