హనుమకొండలోని నంది హిల్స్ ప్రాంతంలో చైన్ స్నాచింగ్ ప్రయత్నం విఫలమైంది. ఇద్దరు మహిళలు నడుస్తుండగా బైక్పై వచ్చిన దొంగలు పుస్తల తాడు దొంగిలించేందుకు యత్నించారు. అయితే, మహిళ మెడలో చున్ని ఉండటం వల్ల తాడు తెగలేదు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలలో రికార్డైంది. పోలీసులు విచారణ చేస్తున్నారు.