హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదైంది. కేటీఆర్ వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.