క్యారెట్లు శీతాకాలపు సూపర్‌ఫుడ్‌గా పేరుగాంచాయి. ఇవి కంటి చూపును మెరుగుపరచడమే కాకుండా, బరువు తగ్గడానికి, రోగ నిరోధక శక్తిని పెంచడానికి తోడ్పడతాయి. విటమిన్లు, ఖనిజాలతో నిండిన క్యారెట్లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి మరియు ఎముకలను దృఢంగా చేస్తాయి.