యాలకులు వంటకాలకు సువాసనను, రుచిని అందిస్తాయి. సోడియం, పొటాషియం, విటమిన్ సి వంటి పోషకాలతో నిండిన యాలకులు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. నోటి దుర్వాసనను తగ్గిస్తాయి, చక్కటి నిద్రను ప్రోత్సహిస్తాయి. అయితే, కిడ్నీలో రాళ్లు, గర్భిణులు, సున్నితమైన చర్మం ఉన్నవారు నిపుణుల సలహా మేరకు తీసుకోవడం ఉత్తమం. రోజుకు రెండు మూడు యాలకులకు మించి తీసుకోకూడదు.