జ్వరం వచ్చినప్పుడు గుడ్డు తినడం సరైందా? కాదా? అనే సందేహం చాలా మందిలో ఉంది. పెద్దలు జ్వరం వచ్చినప్పుడు గుడ్డు తినకూడదని చెబుతున్నా.. వైద్య నిపుణులు ఉడికించిన గుడ్డు తినడం మంచిదని సూచిస్తున్నారు. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అయితే, ఆమ్లెట్ లేదా ఎగ్ దోశ వంటి రూపాల్లో గుడ్డు తినకూడదని వారు సలహా ఇస్తున్నారు.