Buttermilk Benefits: మజ్జిగలో విటమిన్లు (బి12, బి2, ఏ, డి, కె), కాల్షియం, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, గ్యాస్, మలబద్ధకం తగ్గిస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది, కాలేయంలో కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. శరీరానికి తేమను అందిస్తుంది. అయితే, జ్వరం, జలుబు వంటి సమస్యలున్నప్పుడు రాత్రి పూట మజ్జిగ తీసుకోకూడదు.