కేసీఆర్, పార్టీ ఆదేశాలను శిరసావహిస్తానని.. అంతే తప్ప గీతదాటే వ్యక్తి తాను కాదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు స్పష్టంచేశారు. గతంలోనూ ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో తాను తేటతెల్లం చేసినట్లు చెప్పారు. కేటీఆర్కు నాయకత్వం అప్పగిస్తే తాను తప్పకుండా స్వాగతిస్తా.. సహకరిస్తానంటూ స్పష్టంచేశారు.