బ్రౌన్ రైస్, క్వినోవా రెండూ ఆరోగ్యకరమైన ఆహారాలు. క్వినోవాలో ప్రోటీన్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కానీ బ్రౌన్ రైస్ తక్కువ కేలరీలు కలిగి ఉంటుంది. అలాగే ఇది తక్కువ ఖర్చుతో దొరుకుతుంది. డయాబెటీస్ ఉన్నవారికి క్వినోవా గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల మంచిది. ఈ రెండింటిలో ఏది మీకు అనుకూలం అనేది మీ ఆరోగ్య పరిస్థితి, ప్రాధాన్యతలపై ఆధారపడి ఉంటుంది.