బ్రౌన్ రైస్ వైట్ రైస్ కంటే ఎక్కువ పోషకాలను కలిగి ఉంటుంది. ఇందులో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. 100 గ్రాముల వండి బ్రౌన్ రైస్ లో 1.6 గ్రాముల ఫైబర్ ఉంటుంది. అదే మొత్తంలో వైట్ రైస్ లో ఒక గ్రాము కంటే తక్కువ ఉంటుంది. బ్రౌన్ రైస్ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలోనూ, బరువు తగ్గడంలోనూ సహాయపడుతుంది.