వంకాయలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. క్యాలరీలు తక్కువగా ఉండే వంకాయ తినడం వల్ల బరువు తగ్గడం ఈజీ అవుతుంది. వంకాయ గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ఆరోగ్య సమస్యల నుంచి రక్షస్తుంది. వంకాయలో విటమిన్ కె, విటమిన్ బి6, పొటాషియం, మాంగనీస్, ఫోలేట్, ఫైబర్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి.