రాత్రి ఎక్కువ వెలుతురులో నిద్రపోవడం గుండె ఆరోగ్యానికి హానికరం అని తాజా అధ్యయనం వెల్లడించింది. 88,905 మందిపై నిర్వహించిన పరిశోధనలో ఎక్కువ కాంతిలో నిద్రించే వారికి గుండెపోటు, పక్షవాతం వంటి ప్రమాదాలు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. కృత్రిమ కాంతి మన శరీర గడియారాన్ని దెబ్బతీసి, గుండె జబ్బులకు దారితీస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు.