ఒక వివాహ వేడుకలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. పెళ్లి పీటల మీద నుండే వధువు తన ప్రియుడితో వెళ్లిపోయింది. జీలకర్ర బెల్లం కార్యక్రమం పూర్తవగానే, ప్రియుడు మండపంలోకి రావడంతో వధువు అతడిని ప్రేమించానని, అతడినే పెళ్లి చేసుకుంటానని ప్రకటించింది. ఈ సంఘటన వరుడి కుటుంబానికి తీవ్ర మనస్తాపం, ఆర్థిక నష్టాన్ని మిగిల్చింది, పరువు నష్టం కూడా జరిగింది.