కేరళ తిరువనంతపురం జిల్లాలోని ఓ నివాస ప్రాంతంలోని నీటి కాల్వలో కనిపించిన భారీ కింగ్ కోబ్రాను పరుతిపల్లి రేంజ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రోషిని ధైర్యంగా పట్టుకున్నారు. ఆమె చాకచక్యంతో పామును సంచిలో బంధించిన ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రోషిని గతంలో 500 పైగా పాములను బంధించినట్లు తెలుస్తోంది.