బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తెలంగాణ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కనిపించిన పిట్టలదొర పాత్ర గురించి ప్రస్తావించారు. గ్రామీణ నాటకాల్లో కనిపించే ఈ పాత్ర ఆర్భాటపు డైలాగులు చెబుతుందని వివరించారు. ఇకపై పిట్టలదొరసాని అనే కొత్త పాత్రను చూస్తారని, ఇది గతంలో ఎన్నడూ చూడని పరిణామమని అరవింద్ అన్నారు.