బెంగాల్లోని బర్ధవాన్ జిల్లా కల్నాలో జరిగిన వింత దొంగతనం వార్తల్లో నిలిచింది. బుధవారం రాత్రి నాలుగు దుకాణాల్లో క్యాష్ దొంగిలించిన దుండగులు, వెళ్తూ వెళ్తూ ప్రతి దుకాణంలో భగవద్గీతను పెట్టి దానిపై రూ.50 నోటును ఉంచి వెళ్లిపోయారు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డవ్వడంతో దొంగల వింత పని వైరల్ అయ్యింది.