జమ్మూకాశ్మీర్‌లోని అనంతనాగ్‌లో ఊహించని సంఘటన చోటుచేసుకుంది. బీజ్ బెహరా నుంచి అనంతనాగ్ వెళ్తున్న రైలును ఓ పక్షి ఢీకొనడంతో అద్దాలు పగిలిపోయాయి. ఈ ఘటనలో లోకో పైలట్‌కు స్వల్ప గాయాలయ్యాయి. రైలును కొంతసేపు నిలిపివేయగా, సిబ్బంది, ప్రయాణికులు షాక్‌కు గురయ్యారు. టీవీ9 ఈ వార్తను వెల్లడించింది.