బీహార్ మాజీ సీఎం రాబ్రీ దేవి తిరగలిరాయిని తిప్పుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆమె తనయుడు, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ స్వయంగా ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం తమ నైజమని చాటే ఉద్దేశంతో తేజస్వి ఈ వీడియోను షేర్ చేశారు. ఆసక్తికరమైన ఈ వీడియోపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.