ఆంధ్రప్రదేశ్లో జనవరి 1 నుంచి కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. వాహనం నడిపే వారితో పాటు వెనుక కూర్చునే వ్యక్తి కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే మొదటిసారి జరిమానా, రెండోసారి లైసెన్స్ రద్దు, మూడోసారి శాశ్వత రద్దుతో పాటు వాహనం సీజ్ చేస్తారు. వాహనదారులు తక్షణమే రెండో హెల్మెట్ కొనుగోలు చేయాలని సూచన.