ఈశా సద్గురు ఫౌండేషన్ వెబ్సైట్ ప్రకారం, భూత శుద్ధి వివాహం అనేది పెళ్లికాని వారితో పాటు ఇప్పటికే వివాహమైన జంటలు కూడా చేసుకోవచ్చు. యోగా వ్యవస్థలో దీని మూలాలున్నాయి. గర్భవతులు ఈ క్రతువును చేయకూడదు. ప్రత్యేక శిక్షణ పొందిన సుమంగళి వాలంటీర్లు పసుపు చీర ధరించి ఈ వివాహాన్ని జరిపిస్తారు. సమంత షేర్ చేసిన ఫోటోల్లో ఈ విధానం కనిపించింది.