శ్రీశైలంలో దసరా మహోత్సవాలు ఐదవ రోజు వైభవంగా కొనసాగుతున్నాయి. శరణ్ నవరాత్రుల్లో భాగంగా శ్రీశైల భ్రమరాంబికా దేవి సాయంత్రం స్కందమాత అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఆది దంపతులు శేష వాహనంపై ఆసీనులై ప్రత్యేక పూజలు అందుకుంటారు. రాత్రి గ్రామోత్సవం జరగనుంది.