బెంగళూరులో ప్రేమికుడి సజీవ దహనం కేసులో షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి. కిరణ్‌ను కట్టేసి, పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. మొదట తనను తానే తగలబెట్టుకున్నాడని చెప్పిన యువతి, సీసీటీవీ ఫుటేజ్, ఆధారాలతో అడ్డంగా దొరికిపోయింది. ఇది పక్కా ప్రణాళికతో జరిగిన హత్య అని పోలీసులు ధృవీకరించారు.