బెంగళూరు మున్సిపల్ అధికారులు వినూత్న యాంటీ లిటరింగ్ డ్రైవ్‌ను అమలు చేస్తున్నారు. రోడ్లపై చెత్త పారేసే వారిని సీసీ కెమెరాల ద్వారా గుర్తించి, వారి చెత్తను తిరిగి వారి ఇంటి ముందు పడేస్తున్నారు. ఈ "రిటర్న్ గిఫ్ట్"తో పాటు వెయ్యి నుంచి పదివేల రూపాయల వరకు జరిమానాలు విధిస్తూ పౌరులలో పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నారు.