బెంగుళూరులో కుండపోత వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై కార్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి. భారీ వర్షానికి జనజీవనం స్తంభించింది. బెంగుళూరుతో పాటు కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో 100 మిల్లీ మీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యింది.