రుచి కోసం వాడే వెల్లుల్లిలో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఉడికించిన వెల్లుల్లి కంటే పచ్చి వెల్లుల్లి తింటే దానిలోని పోషకాలు మన శరీరానికి పూర్తిగా అందుతాయి. వెల్లుల్లిలోని అలిసిన్ అనే రసాయనం హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. యాంటీవైరల్ లక్షణాలు వైరస్ల బారి నుండి కాపాడతాయి.