వాతావరణ శాఖ ప్రకారం, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఎల్లుండి(శనివారం) అల్పపీడనం ఏర్పడి, 24 నాటికి వాయుగుండంగా మారనుంది. దీని ప్రభావంతో రాగల రెండు మూడు రోజుల్లో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 3-4 డిగ్రీలు తగ్గనున్నాయి. మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో తీవ్రమైన చలిగాలులు వీచే అవకాశం ఉంది.