ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈ నెల 27న వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఐఎండీ ప్రకారం, అది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి ఒడిశా తీరాన్ని దాటవచ్చు. అదే సమయంలో ఉత్తర ప్రదేశ్ నుండి మధ్యప్రదేశ్, విదర్భ మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.