ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో 70 కాసుల బంగారం మాయం కావడం తీవ్ర కలకలం రేపింది. గోల్డ్ అప్రైజర్ రాజు పరారీలో ఉండటంతో అతనిపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఖాతాదారులు ఆందోళనకు దిగగా, పోలీసులు భద్రత కల్పించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది, తనిఖీలు కొనసాగుతున్నాయి.