తెలంగాణలోని కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో చోరీకి ప్రయత్నం జరిగింది. గుర్తు తెలియని దుండగులు బ్యాంకు కిటికీ గ్రిల్‌ను తొలగిస్తుండగా, ఎమర్జెన్సీ అలారం మోగింది. దీంతో భయపడిన దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు వేలిముద్రలు సేకరించి నిందితుల కోసం గాలిస్తున్నారు.