అరటిపండు ఒక సూపర్ ఫుడ్. ఏడయాది పొడువునా దొరికే పచ్చి అరటిని కూరగా పండిన అరటిపండును ఇష్టంగా తింటుంటారు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడి తినే అరటిని శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడమే కాక సులభంగా జీర్ణం కూడా చేస్తుంది. అరటిపండులో మెగ్నీషియం, పొటాషియం, విటమిన్లు మొదలైన పోషకాలు నీరసాన్ని పారదోలి శరీరానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి.