అస్సాం ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి చేసుకుంటే జీతంలో 20 శాతం కోత విధించి, ఆ మొత్తాన్ని మొదటి భార్యకు చెల్లిస్తారు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే 10 శాతం జీతం కోత కూడా తప్పదు. ఆర్థిక రక్షణ కోసమే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం తెలిపారు.