ఆసిఫాబాద్ పోలీసులు కెరమెరి మండలం నారాయణగూడలో డ్రోన్ల సాయంతో 55 లక్షల విలువైన గంజాయి సాగును గుర్తించారు. పత్తి, మిరప పొలాల్లో నిర్భయంగా పెంచుతున్న 530 మొక్కలను స్వాధీనం చేసుకుని, 53 మందిపై కేసులు నమోదు చేశారు. ఏఎస్పీ చిత్రరంజన్ అక్రమ సాగుపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.