అరకులోయ పద్మాపురం బొటానికల్ గార్డెన్స్‌లో భారీ నాగుపాము కనిపించడంతో పర్యాటకులు భయాందోళనకు గురయ్యారు. పాము పడగవిప్పి బుసలు కొట్టడంతో పర్యాటకులు పరుగులు తీశారు. స్నేక్ క్యాచర్ కృష్ణ పామును సురక్షితంగా బంధించి అడవిలో వదిలాడు. వాతావరణ మార్పుల వల్ల పాములు జనావాసాలకు చేరుతున్నాయని ఆయన తెలిపారు.