ఏఆర్ ఇన్స్పెక్టర్ స్వర్ణలత మరోసారి అక్రమాలకు పాల్పడినట్లు తెలిసింది. విశాఖపట్నం మధురవాడ సబ్ రిజిస్ట్రార్‌ను బెదిరించిన కేసులో ఆమె పాత్ర ఉందని పోలీసులు తేల్చారు. గతంలో నోట్ల మార్పిడి కేసులో అరెస్ట్ అయిన స్వర్ణలతకు సినిమా పిచ్చి ఉండి, డబ్బుల కోసం అక్రమాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె పోలీసుల అదుపులో ఉంది.