ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు జ్వరంతో బాధపడుతూ సెలైన్ వేసుకుని శాసనసభకు హాజరయ్యారు. ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేసిన మంత్రి నారా లోకేశ్, విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. నిమ్మల విశ్రాంతి తీసుకునేలా డిప్యూటీ స్పీకర్ రూలింగ్ ఇవ్వాలని లోకేశ్ కోరడంతో శాసనసభలో నవ్వులు చిందాయి.