సత్యసాయి జిల్లాలోని కల్లి తండాలో వీర జవాన్ మురళి నాయక్ అంత్యక్రియలు అధికారిక, సైనిక లాంఛనాలతో జరిగాయి. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్, హోం మంత్రి అనిత, ఇతర ప్రముఖులు కన్నీటి వీడ్కోలు పలికారు. ఆర్మీ అధికారులు సైనిక లాంఛనాలతో జాతీయ జెండాను ఆయన తల్లిదండ్రులకు అందించారు.