మద్యం కుంభకోణం కేసులో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టయ్యారు. లుకౌట్ నోటీసు జారీ కావడంతో బెంగుళూరు ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకుని ఏపీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సిట్ అధికారులు బెంగుళూరుకు వెళ్లి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.