ఆంధ్రప్రదేశ్లో వేసవి తాపం ముదురుతోంది. రాబోయే 3-5 రోజుల పాటు రాష్ట్రంలో ఎండలు తీవ్రంగా ఉంటాయని ఐఎండీ హెచ్చరించింది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 42°C వరకు నమోదయ్యే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయి. ప్రజలు ఉదయం 11 నుండి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావద్దని సూచనలు జారీ అయ్యాయి.