కాకినాడ పోర్ట్ నుంచి పశ్చిమ ఆఫ్రికాకు రేషన్ బియ్యం అక్రమ తరలింపు వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీరియస్ అయ్యారు. రేషన్ బియ్యాన్ని విదేశాలకు అక్రమంగా తరలిపోతుంటే పోర్ట్ అధికారులు, జిల్లా అధికారులు ఏం చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు.