ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉద్రిక్తతల మధ్య బుధవారం (11 ఫిబ్రవరి) ప్రారంభమయ్యాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తుండగా, వైసీపీ సభ్యులు ప్రతిపక్ష హోదా, సభ్యుల హక్కులు, మెడికల్ కళాశాలల పీపీపీ రద్దు, నిరుద్యోగ భృతి డిమాండ్లతో నిరసన తెలిపారు. ప్లకార్డులు చించి స్పీకర్ పోడియంపైకి విసిరి, అనంతరం గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించి వాకౌట్ చేశారు.