ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ మరో మహమ్మారి ముప్పును హెచ్చరించారు. ఇది అనివార్యమని, ఎప్పుడైనా సంభవించవచ్చని ఆయన పేర్కొన్నారు. కరోనా మహమ్మారిని గుర్తుచేస్తూ, ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా చక్కబడే వరకు మరో మహమ్మారి ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ దీనికి సిద్ధంగా ఉండాలని సూచించారు.