సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కుమార్తె కావ్య మారన్ వివాహం ఖరారు అయినట్లు వార్తలు వస్తున్నాయి. వీరి పెళ్లి నవంబర్ 10 లేదా 11న గ్రీస్ దేశంలో జరగనుంది. అనంతరం నవంబర్ 21న చెన్నైలో వివాహ విందు ఉంటుంది. కావ్య తండ్రి కళానిధి మారన్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ లను హైదరాబాద్లో కలిసి విందుకు ఆహ్వానించారు.