యువ దర్శకుడు అనిల్ నక్క కేవలం నాలుగు రోజుల్లోనే సంజీవ్ అనే ఇండిపెండెంట్ ఫీచర్ ఫిల్మ్ ను పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 70 నిమిషాల నిడివి గల ఈ చిత్రం, కలలు, స్నేహం, ఆర్థిక సమస్యలు, సినీ పరిశ్రమలోని వాస్తవాలను ఆవిష్కరిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్రం ఆహాలో అందుబాటులో ఉంది.