ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి గుంటూరులో సందడి చేశారు. టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తె వివాహ వేడుకకు హాజరైన ఇద్దరు సీఎంలు నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఒకే వేదికపై తెలుగు సీఎంలు కనిపించడంతో తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.