బొప్పాయి చెట్టుకు సహజంగా ఒకే కాండం ఉంటుంది. అక్కడక్కడ దానికి ఒకటో రెండో కొమ్మలు ఉండటం మీరు చూసి ఉంటారు. కానీ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పాసర్లపూడి గ్రామంలోని ఈ బొప్పాయి చెట్టుకు ఏకంగా 15 కొమ్మలున్నాయి. అంతేకాదు ఈ చెట్టు 15 ఏళ్లుగా ప్రతి కొమ్మకు 20 నుంచి 30 కాయలు కాస్తూనే ఉంది. ఈ చెట్టుకు ఎటువంటి పోషక పదార్థాలు ఇవ్వకపోయినా సుమారు 200 వరకు కాయలు ఉండటం విశేషం. జన్యుపరమైన కారణాల వల్ల బొప్పాయి చెట్టుకు ఎక్కువ కొమ్మలు వచ్చే అవకాశం ఉందని చాలా అరుదుగా మాత్రమే ఇలా జరుగుతుందని ఉద్యానవనశాఖ అధికారులు తెలిపారు. ఏది ఏమైనా ఈ బొప్పాయి చెట్టు బలం కదా!