బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడుతున్నా, ఏపీలోని అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు, ఫ్లాష్ ఫ్లడ్లకు ఐఎండీ అలర్ట్ జారీ చేసింది. 20 సెంటీమీటర్ల కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నిజాంపట్నం పోర్టులో మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.